జూన్‌ 14న తిరుచానూరులో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ సంకీర్తనాలాపన

జూన్‌ 14న తిరుచానూరులో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ సంకీర్తనాలాపన

తిరుపతి, జూన్‌ 13, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చెంత జూన్‌ 14వ తేదీ శుక్రవారం తితిదే ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ సంకీర్తనాలాపన నిర్వహించనున్నారు.  శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ పద్మావతి అమ్మవారిపై రచించిన సంకీర్తనలను సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు ఈయన ఆలపించనున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తిలకించేందుకు వీలుగా ఆలయం ముందు గల వాహన మండపంలో ఈ కార్యక్రమం జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.