జూన్ 14 నుండి 18వ తేదీ వరకు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక తెప్పోత్సవాలు

జూన్ 14 నుండి 18వ తేదీ వరకు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుపతి, జూన్‌-11, 2008: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి అలయంలో జూన్‌ 14వ తేది నుండి 18వ తేది వరకు ఐదు రోజులపాటు వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాలలో తెప్పలపై సాయంత్రం 6-30 నుండి 7-30 గం||ల మద్య మొదటిరోజు శ్రీకృష్ణస్వామివారు, రెండవరోజు శ్రీసుందరరాజస్వామివారు, మూడు, నాలుగు, ఐదవ రోజులలో శ్రీపద్మావతి అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరిస్తారు.

అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 7-30 గం||లకు తిరువీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో మొదటిరోజు శ్రీకృష్ణస్వామివారు, రెండవరోజు శ్రీసుందరరాజస్వామివారు, మూడవరోజు శ్రీపద్మావతి అమ్మవారు, నాలుగవరోజున గజవాహనంపైన, ఐదవరోజున గరుడవాహనంపైన శ్రీపద్మావతి అమ్మవారు నాలుగునాడవీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందైన దర్శనం ఇస్తారు.

తెప్పోత్సవాల సందర్భంగా తి.తి.దే.ధర్మప్రచారపరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే సంగీత,సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.