జూన్‌ 15 నుండి 19వ తేదీ వరకు హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

జూన్‌ 15 నుండి 19వ తేదీ వరకు హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, జూన్‌ 12, 2013: హైదరాబాదు నగరంలోని హిమాయత్‌నగర్‌లో గల బాలాజీ భవన్‌లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పాంచాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్‌ 15 నుండి 19వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూన్‌ 14వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
జూన్‌ 15వ తేదీ ఉదయం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి శేష వాహనంపై స్వామివారు విహరిస్తారు. అలాగే జూన్‌ 16వ తేదీ రాత్రి హనుమంత వాహనసేవ జరుగనుంది. జూన్‌ 17న ఉదయం గజవాహనం, రాత్రి గరుడవాహనం, జూన్‌ 18న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనసేవ కన్నులపండువగా జరుగనున్నాయి. జూన్‌ 19వ తేదీ ఉదయం ఘటాభిషేకం, చక్రస్నానం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 9.00 గంటలకు, రాత్రి 8.00 గంటలకు వాహనసేవలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.