SRIVARI DARSHAN OFFLINE TOKENS QUOTA ISSUED IN TIRUPATI _ జూన్ 17వ తేదీ వరకు గల శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్ల జారీ
Tirupati, 10 Jun. 20: TTD has commenced issue of offline tokens for Srivari darshan on Wednesday.
The offline quota of Time slot tokens in free Sarva Darshanam upto June 17 is released by TTD at the rate of 3750 tokens per day.
On Wednesday starting from 7am till 3pm, TTD has issued tokens upto June 14 at all its counters in Tirupati located at Vishnu Nivasam (8 Counters), Srinivasam (6 counters), Bhudevi complex near Alipiri (4 counters).
The rest of tokens will be issued on Thursday from 7am to 3pm or till the quota exhaust whichever is before.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 17వ తేదీ వరకు గల శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్ల జారీ
తిరుమల, 2020 జూన్ 10: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు గాను జూన్ 17వ తేదీ వరకు గల ఆఫ్‌లైన్ దర్శన టోకెన్లను బుధవారం నుండి తిరుపతిలో జారీ చేస్తున్నారు.
తిరుపతిలోని విష్టునివాసం(8 కౌంటర్లు), శ్రీనివాసం(6 కౌంటర్లు), అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్‌లో (4 కౌంటర్లు) దర్శన టోకెన్ల జారీ కొనసాగుతోంది. ఒక రోజు కోటాలో 3,750 టోకెన్లు ఉన్నాయి. బుధవారం సాయంత్రం కౌంటర్లు మూసే సమయానికి జూన్ 14వ తేదీ వరకు ఉన్న దర్శన టోకెన్లను జారీ చేశారు. మిగిలిన టోకెన్లను గురువారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు లేదా నిర్దేశిత కోటా ఉన్నంత వరకు జారీ చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.