CHENNA KESHAVA TEMPLE ANNUAL FETE _ జూన్ 17 నుండి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 05 JULY 2024: The annual Brahmotsavams of Sri Chenna Kesava Swamy temple in Tallapaka of Annamaiah district are scheduled from July 17 to 25 with Ankurarpanam on July 16.
Important days includes Garuda Vahanam on July 21, Arjita Kalyanotsavam (Rs. 300/-per ticket on which two are allowed)on July 22, Rathotsavam on July 23 and Chakra Snanam on July 25.
Pushpayagam will be observed on July 26 between 6pm and 8pm.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూన్ 17 నుండి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 జూలై 05: అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూన్ 16వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.
జూలై 17న ఉదయం 9 నుండి 10 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 18, 19, 20వ తేదీల్లో ఉదయం పల్లకీ సేవ నిర్వహిస్తారు.
జూలై 18న రాత్రి హంస వాహనం, జూలై 19న రాత్రి సింహ వాహనం, జూలై 20న రాత్రి హనుమంత వాహనం, జూలై 21న రాత్రి గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.
జూలై 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 8.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు.
జూలై 23న సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, జూలై 24న రాత్రి అశ్వవాహనం, జూలై 25న ఉదయం 9.30 నుండి 10.15 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జూలై 26న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.