SRI PARASARESWARA SWAMY BRAHMOTSAVAMS _ జూన్ 19 నుండి 28వ తేదీ వరకు నారాయణవనం శ్రీ పరాశరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 13 JUNE 2023: The annual brahmotsavams in the TTD sub-temple of Sri Parasareswara Swamy are scheduled between June 19 and June 28 with Ankurarpanam on June 18.
On June 26 Kalyanotsavam will be observed wherein Grihasta devotees shall participate on payment of Rs.300 per ticket on which two persons are allowed.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
జూన్ 19 నుండి 28వ తేదీ వరకు నారాయణవనం శ్రీ పరాశరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2023 జూన్ 13: నారాయణవనం శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 19 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయ. జూన్ 18వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
జూన్ 19వ తేదీ ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం చంద్రప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు వాహన సేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జూన్ 20వ తేదీన సింహ వాహనం, జూన్ 21న హంస వాహనం, జూన్ 22న శేష వాహనం, జూన్ 23న నంది వాహనం, జూన్ 24న గజ వాహనాలపై ఊరేగి స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
అదేవిధంగా జూన్ 25వ తేదీన రథోత్సవం జరుగనుంది. జూన్ 26వ తేదీన రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, అనంతరం అశ్వ వాహనసేవ నిర్వహించనున్నారు. జూన్ 27న ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు నటరాజస్వామివారి ఉత్సవం, సాయంత్రం రావణేశ్వర వాహనసేవ జరుగనున్నాయి. జూన్ 28వ తేదీన ఉదయం 11 గంటలకు త్రిశూలస్నానం నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
జూన్ 26వ తేదీన నిర్వహించనున్న ఆర్జిత కళ్యాణోత్సవంలో రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. ఈ ఉత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.