ADMISSIONS OPEN FROM JUNE 2 FOR SV COLLEGE OF MUSIC, DANCE & NADASWARAM SCHOOL _జూన్ 2 నుండి ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌లో ప్రవేశాల‌కు దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, 31 May 2025: Applications are invited from eligible students for admission into various courses for the academic year 2025–26 at Sri Venkateswara College of Music and Dance and SV Nadaswaram & Dolu School, located in Tirupati, starting from June 2.
 
The college offers full-time, Visharada (Diploma), and Praveena (Advanced Diploma) courses in Vocal, Veena, Flute, Violin, Nadaswaram, Dolu, Bharatanatyam, Kuchipudi, Dance, Harikatha, Mridangam, Ghatam.
SV Nadaswaram and Dolu School offers Full-time Certificate and Diploma courses. Classes will commence from June 27. Hostel facilities will be provided for students coming from other regions.
 
Interested candidates can obtain the application form during college working hours by submitting a Demand Draft (DD) of ₹50 in the name of EO, TTD.
 
Eligibility For regular courses:8th standard Pass, Evening courses: 5th standard Pass
For more details, contact the following numbers during working hours of the college:9440793205, 9848374408.
 
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  
జూన్ 2 నుండి ఎస్వీ సంగీత, నృత్య‌ కళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌లో ప్రవేశాల‌కు దరఖాస్తుల ఆహ్వానం
 
తిరుపతి, 2025, మే 31; తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో 2025-26వ విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి జూన్ 02వ తేదీ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
 
కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి, నృత్యం, హరికథ, మృదంగం, ఘటం విభాగాల్లో ఫుల్‌టైమ్, విశార‌ద‌(డిప్లొమా), ప్ర‌వీణ‌(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాద‌స్వ‌రం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్‌టైమ్ స‌ర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి.
 
 జూన్ 27వ తేదీ నుండి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి. ఇత‌ర ప్రాంతాల విద్యార్థుల‌కు హాస్ట‌ల్ వ‌స‌తి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో ఈవో, టిటిడి పేరుతో రూ.50/- డిడి తీసి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్‌ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కోర్సులకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
 
ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 9440793205, 9848374408 నంబర్లలో సంప్రదించగలరు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది