PUSHPA YAGAM ON JULY 22 AT APPALAYAGUNTA TEMPLE _ జూన్ 22వ తేదీ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం
Tirupati,17 July 2024: TTD is organising the Pushpayagam fete at the Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta on July 22 with Ankurarpanam event on July 21.
The purpose of fete is to ward off any lapses which have occurred during the recent annual Brahmotsavam held from June 17-25.
As part of the festivities, the Snapana Tirumanjanam will be performed to the utsava idols of Sri Prasanna Venkateswara Swami and His consorts in the morning followed by Pushpa Yagam in the evening.
Varieties of tons of flowers are used and finally Thiru veedhi utsavam is observed.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూన్ 22వ తేదీ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం
తిరుపతి, 2024 జూలై 17: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 22వ తేదీ పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూలై 21న సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
ఆలయంలో జూన్ 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికిప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూలై 22న ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం చేపడతారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.40 నుండి సాయంత్రం 5 గంటలవరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.