జూన్ 25న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి రథోత్సవం
జూన్ 25న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి రథోత్సవం
తిరుపతి, జూన్ 24, 2013: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. మిథున లగ్నంలో ఉదయం 7.10 గంటలకు రధారోహణం ప్రారంభమవుతుంది.
అనంతరం ఉదయం 7.40 నుండి 9.30 గంటల వరకు రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.