BTU OF NANDALUR TEMPLE FROM JUNE 28 TO JULY 6 _ జూన్ 28 నుండి జూలై 6వ తేదీ వరకు నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 21 June 2023: TTD is organising the annual Brahmotsavams of Sri Soumyanatha Swami Temple in Nandalur at Annamaiah district from June 28-July 6 with Ankurarpanam fete on June 27 evening.
Following are details of daily Vahana Sevas held both in the morning and evening and other special fetes as part of the Brahmotsavam.
28-06-2023 Dwajarohanam and Yali Vahana at night
29-06-2023 Pallaki Seva and Hamsa Vahana
30-06-2023 Pallaki Seva and Simha Vahana
01-07-2023 Pallaki Seva Hanumantha vahana
02-07-2023 Sesha Vahana and Garuda Vahana
03-07-2023 Surya Prabha Vahana and Chandra Prabha Vahana
04-07-2023 Arjita Kalyanotsavam and Gaja Vahana
05-07-2023 Rathotsavam and .Aswa Vahana
06-07-2023 Chakra snanam and Dwaja avarohanam
During the Arjita Kalyanotsavam on July 4, an interested devotee couple could participate with a ticket of ₹500 and beget Prasadam of one uttarium, one blouse piece and Prasadam. TTD is also organising a grand Pushpayagam fete on the evening of July 7.
As part of celebrations, the artists of HDPP, Annamacharya project, Dasa Sahitya etc will present daily cultural devotional activities like Bhakti sangeet, kolatas, sankeertans etc.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 28 నుండి జూలై 6వ తేదీ వరకు నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2023 జూన్ 21: అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 28 నుండి జూలై 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూన్ 27వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.
జూన్ 28న ఉదయం 9 నుండి 10 గంటల వరకు సింహ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ
28-06-2023
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – యాలి వాహనం
29-06-2023
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హంస వాహనం
30-06-2023
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – సింహ వాహనం
01-07-2023
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హనుమంత వాహనం
02-07-2023
ఉదయం – శేష వాహనం
రాత్రి – గరుడ వాహనం
03-07-2023
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
04-07-2023
ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)
రాత్రి – గజ వాహనం
05-07-2023
ఉదయం – రథోత్సవం (ఉదయం 9 గంటలకు)
రాత్రి – అశ్వవాహనం
06-07-2023
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
జూలై 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 7న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.