CHATURVEDA HAVANAM AT TIRUPATI FROM JUNE 29 TO JULY 5 _ జూన్ 29 నుండి జులై 5వ తేదీ వరకు తిరుపతిలో చతుర్వేద హవనం- పరేడ్ మైదానంలో ఏర్పాట్లు పరిశీలించిన జేఈవో శ్రీమతి సదా భార్గవి

JEO (H&E) INSPECTS ARRANGEMENTS AT TTD PARADE GROUNDS

Tirupati, 20  June 2023: TTD JEO  Smt Sada Bhargavi inspected the Parade Grounds of TTD in Tirupati on Tuesday evening and directed thr officials concerned to make elaborate arrangements for the ensuing seven day Sri Srinivasa Chaturveda Havanam schedules between June 29 and July 5.

Speaking on the occasion she said similar programs were conducted in the past at Visakhapatnam and Kovvur and now being planned at Tirupati for the first time and urged all departments to work in coordination to make the spiritual event a huge success. 

The program include discourses by Vedic Pundits on the significance and origin of Vedas.

In all, 32 Rutwiks from AP and Telangana will participate in Havanam. She instructed officials concerned to create a divine and spiritual ambience.

After morning vedic rituals, the artists of Annamacharya and  Dasa Sahitya Projects will present cultural programs, bhakti sangeet and Pravachanam.

SVBC will telecast the program on all seven days for the benefit of devotees across the nation and overseas.

The VC of SV Vedic University Acharya Rani Sadasivamurty, CAuO Sri Sesha Shailendra, CE Sri Nageshwar Rao, VGO Sri Manohar, SV Goshala Director Dr Harnath Reddy, PRO Dr Ravi,  All Projects Program Officer Sri Rajagopal Rao, DPP Secretary Sri Srinivasulu, Additional Health Officer Dr Sunil, DE(Electrical) Smt Saraswati, SVIHVS Special Officer Dr Vibhishana Sharma and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 29 నుండి జులై 5వ తేదీ వరకు తిరుపతిలో చతుర్వేద హవనం

– పరేడ్ మైదానంలో ఏర్పాట్లు పరిశీలించిన జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 2023 జూన్ 20: లోక కల్యాణార్థం టీటీడీ పరిపాలన భవనంలోని పరేడ్ మైదానంలో జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నట్లు జేఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు. మంగళవారం జేఈవో అధికారులతో కలిసి పరేడ్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం కార్యక్రమాన్ని టీటీడీ గతంలో విశాఖపట్నం, కోవూరులో నిర్వహించినట్లు తెలిపారు. తిరుపతిలో మొదటిసారిగా 7 రోజులపాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇందులో వేదాల ప్రాముఖ్యత, వేదాలు ఎలా ఉద్భవించాయి, వేదాల విశిష్టత, వేదాలు ప్రపంచానికి ఏ విధంగా మేలు చేస్తాయనే అంశాలపై ప్రముఖ పండితులతో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

చతుర్వేద హవనంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్టాల నుండి 32 మంది రుత్వికులు ఈ కార్యక్రమాన్ని శాస్రోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. మైదానాన్ని ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఉదయం హోమ కార్యక్రమాలు, సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, తరిగొండ వెంగమాంబ చరిత్ర ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు వీక్షించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేఈవో తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదాశివమూర్తి, సిఏఓ శ్రీ శేష శైలేంద్ర, సిఈ శ్రీ నాగేశ్వరరావు, విజిఓ శ్రీ మనోహర్, గోశాల డైరెక్టర్ డా.హరినాథ రెడ్డి, పిఆర్ఓ డా.రవి, డిపిపి ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు, డి పిపి కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు ,అదనపు ఆరోగ్యాధికారి డా . సునీల్, ఈఈ శ్రీ ప్రసాద్, డిఈ (ఎలక్ట్రికల్ ) శ్రీమతి సరస్వతి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ విభీషణ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.