SUNDARARAJA SWAMY ANNUAL UTSAVAMS FROM JUNE 29 TO JULY 1 _ జూన్ 29 నుండి జూలై 1వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతారోత్సవాలు
Tirupati, 28 June 2021:The annual Avatarotsavams of Sri Sundararajaswamy at Tiruchanoor will be observed from June 28 to July 01.
Every day there will be Snapana Tirumanjanam for Sridevi, Bhudevi sameta Sri Sundararajaswamy will be observed between 2:30pm and 4pm. There will be Unjal Seva between 6pm and 7pm during these days.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూన్ 29 నుండి జూలై 1వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షి
తిరుపతి, 2021 జూన్ 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు జూన్ 29 నుండి జూలై 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు.
సంక్షిప్త సమాచారం :
శ్రీ సుందరరాజస్వామివారి అవతా
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.