BRAHMOTSAVAMS OF HYDERABAD TEMPLE FROM JUNE 6-10 _ జూన్ 6 నుండి 10వ తేదీ వరకు హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 29 May 2022: TTD is organising the annual Brahmotsavam of Sri Venkateswara temple at Himayatnagar in Hyderabad from June 6-10 with Ankurarpanam fete on June 5.

 

The important days includes Dwajarohanam on June 6, Shanti kalyanam and Garuda Vahana in June 8, Rathotsavam on June 9 and on June 10, Chakra Snanam, Pushpa Yagam and Dwajavarohanam will be observed.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 6 నుండి 10వ తేదీ వరకు హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 మే 29 : హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 9 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వ‌హించ‌నుంది.

ఈ ఉత్సవాలకు జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ జ‌రుగ‌నుంది. జూన్ 6న‌ ఉదయం 11గంట‌ల‌కు ఆల‌య ప్రాకారంలో శేష వాహ‌నంపై స్వామివారిని వేంచేపు చేస్తారు. ఉద‌యం 11.20 గంట‌ల‌కు ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అదేరోజు రాత్రి 8 గంట‌ల‌కు హ‌నుమంత‌ వాహనంపై స్వామివారు విహరిస్తారు.

జూన్ 7న ఉదయం 8 గంట‌ల‌కు సూర్యప్ర‌భ వాహ‌నసేవ‌, ఉద‌యం 10.30 గంట‌ల‌కు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, రాత్రి 8 గంట‌ల‌కు చంద్ర‌ప్ర‌భ‌ వాహనసేవ జరుగనుంది. జూన్ 8న ఉదయం 9 గంట‌ల‌కు గజవాహనం, ఉద‌యం 11 గంట‌ల‌కు శాంతి క‌ల్యాణం, రాత్రి 8 గంట‌ల‌కు గరుడసేవ నిర్వ‌హిస్తారు.

జూన్ 9న ఉదయం 8 గంట‌ల‌కు రథోత్సవం, రాత్రి 8 గంట‌ల‌కు అశ్వవాహనసేవ జరుగనున్నాయి. జూన్ 10న‌ ఉదయం 10.30 గంట‌ల‌కు చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, రాత్రి ధ్వజావరోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.