జూన్ 8న కోయంబత్తూర్, జూన్ 9న మైసూరులో శ్రీనివాస కల్యాణాలు
జూన్ 8న కోయంబత్తూర్, జూన్ 9న మైసూరులో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి, జూన్ 7, 2013: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్ 8, 9వ తేదీల్లో శ్రీనివాస కల్యాణాలు వైభవంగా జరుగనున్నాయి.
జూన్ 8వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నగరంలో శ్రీ వరుణ భగవాన్ ఆలయం ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వేడుకగా జరుగనుంది. అదేవిధంగా జూన్ 9వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో శ్రీ కల్యాణ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం కన్నులపండుగగా నిర్వహించనున్నారు. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఓఎస్‌డి శ్రీ కె.రామకృష్ణ ఈ కల్యాణోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి కల్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.