MAHA SAMPROKSHANAM AND KALYANAM ON JUNE 8 IN JAMMU _ జూన్ 8న జమ్మూలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

Jammu, 06 June 2023: TTD has geared up to observe the twin religious events of Maha Samprokshanam of Sri Venkateswara Swamy temple in Jammu on June 8 while Srivari Kalyanam will be observed on the same day evening.

After Maha Samprokshanam in Mithuna Lagnam, devotees will be allowed for darshan from 9:30am onwards. In the evening from 5pm onwards Srinivasa Kalyanam will be performed.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 
జూన్ 8న జమ్మూలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ
 
– శ్రీవారి కల్యాణోత్సవం
 
జమ్మూ, 06 జూన్ 2023: దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న టీటీడీ ఉత్తరాదిలోని జమ్మూలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించింది. వైఖానస ఆగమోక్తంగా, సర్వాంగ సుందరంగా ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. మాత వైష్ణోదేవి దర్శనం కోసం జమ్మూ వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయ సందర్శన మరో ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.
 
జూన్ 7న బుధవారం ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, జలాధివాసం, రత్నన్యాసం, ధాతున్యాసం, విమాన కలశ స్థాపన బింబస్థాపన(విగ్రహప్రతిష్ట), సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, రాత్రి శయనాధివాసం నిర్వహిస్తారు.
 
జూన్ 8న గురువారం ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు మిధున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.