MOHINI MESMERIZES _ మోహినీ అలంకారంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

మోహినీ అలంకారంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

హైద‌రాబాద్ / తిరుపతి, 2025 మార్చి 02: జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉద‌యం 8 గంటలకు స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను క‌టాక్షించారు.

భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం సకల లోక కల్యాణకారకుడు అయిన శ్రీ వేంకటేశ్వరుడు దివ్యమోహినీ రూపంలో ఉత్సవమూర్తియై, తిరుచ్చిపై చిన్న కృష్ణుడు భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచు కోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది

TIRUPATI, 02 MARCH 2025: As a part of the ongoing annual fete in SV temple at Jubilee Hills, the processional deity took out a celestial ride on the finely decked Palanquin in Mohini Avatara.

The devotees were mesmerized to see the divine charming universal damsel.

In the evening Garuda Seva will be observed.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI