ANKURARPANAM HELD _ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirupati, 25 February 2025: The annual brahmotsavams in Jubilee Hills Sri Venkateswara Swamy temple all set to commence with Dhwajarohanam on February 26 with Ankurarpanam observed on Tuesday.

The ritual of Beejavapanam was held between 6pm and 8pm.

AEO Sri Ramesh and other Temple staff were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

– బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

హైద‌రాబాద్ / తిరుప‌తి, 2025 ఫిబ్ర‌వ‌రి 25: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ర‌మేష్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.

ఫిబ్రవరి 26న ధ్వజారోహణం :

ఫిబ్రవరి 26వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉద‌యం 9.45 – 10.10 గంట‌ల మధ్య మేష లగ్నములో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 8 గంట‌ల వరకు పెద్దశేష వాహనం నిర్వ‌హించ‌నున్నారు.

ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

26-02-2025 ధ్వజారోహణం(మేష ల‌గ్నం) పెద్దశేష వాహనం

27-02-2025 చిన్నశేష వాహనం హంస వాహనం

28-02-2025 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

01-03-2025 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

02-03-2025 పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

03-03-2025 హనుమంత వాహనం గజ వాహనం

04-03-2025 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

05-03-2025 రథోత్సవం అశ్వవాహనం

06-03-2025 చక్రస్నానం ధ్వజావరోహణం

మార్చి 7న మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం జరుగనుంది.

టిటిడి ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.