జూలై 5వ తేదీ టిటిడి ఉద్యోగులతో కాగడాల ప్రదర్శన – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ బి.కరుణాకరరెడ్డి

జూలై 5వ తేదీ టిటిడి ఉద్యోగులతో కాగడాల ప్రదర్శన – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ బి.కరుణాకరరెడ్డి

తిరుపతి జూలై-4, 2008: అమృతోత్సవాలలో భాగంగా జూలై 5వ తేది సాయంత్రం తితిదే ఉద్యోగులు, పురప్రజలతో తిరుపతిలో కాగడాల ప్రదర్శన నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తి.తి.దే.,ఛైర్మెన్‌ శ్రీ బి.కరుణాకరరెడ్డి తెలిపారు. శుక్రవారం కాగడాల ప్రదర్శనపై తీసుకోవలసిన ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఛైర్మెన్‌ మాట్లాడుతూ అమృతోత్సవాలు ఇటు తితిదే ఉద్యోగులు, అటు స్థానికులు, పురప్రజలు, భక్తులు ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రదర్శనలో దాదాపు 10,000 మంది తితిదే ఉద్యోగులు, ఉద్యోగినీలు, వారి కుటుంబసభ్యులు, తిరుపతి పురప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈ కాగడాల ప్రదర్శన శనివారం సాయంత్రం 6గం||లకు తితిదే పరిపాలనా భవనం నుండి వి.వి.మహల్‌, నగరపాలక సంస్థ, తిలక్‌ రోడ్‌, బండ్లవీధి, గ్రూప్‌ థియేటర్స్‌, రైల్వేస్టేషన్‌, గాంధీరోడ్డు, చిన్న బజారు వీధి, మిట్టవీధి, తీర్థకట్టవీధి, అన్నమాచార్య కళామందిరం మీదుగా కాగడాల ప్రదర్శన తితిదే పరిపాలనా భవనం చేరుకుంటుంది. ర్యాలికి ముందు ఒక వాహనము ముందుంటుంది. ఈ వాహనంలో స్వామివారి ఉత్సవమూర్తులు ఉంటారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చునని ఆయన చెప్పారు. కనుక స్థానికులు పురప్రజలు ఎక్కువమంది ఆనందోత్సోహాలతో ఈ కాగడాల ప్రదర్శనలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము.

ఈ సమీక్షా సమావేశంలో తితిదే ప్రత్యేకాధికారి శ్రీఏ.వి.ధర్మారెడ్డి, ఆడిషనల్‌ ఎస్పీ శ్రీఅమ్మిరెడ్డి ఇతర పోలీసు, రెవిన్యూ, తితిదే అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.