జూలై 6న తిరుప‌తిలో దీపోత్సవం

జూలై 6న తిరుప‌తిలో దీపోత్సవం
 
తిరుపతి, జూలై-5, 2008: తిరుమల తిరుపతి దేవస్థానముల అమృతోత్సవాలలో భాగంగా జూలై 6వ తేది సాయంత్రం 5-30 గం||లకు మహిళలచే దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం 5-30 గం||లకు తి.తి.దే., పరిపాలనాభవనం నుండి పాత మెటర్నిటీ ఆసుపత్రి, రామకృష్ణ డీలక్స్‌ సర్కిల్‌ ద్వారా రామచంద్ర పుష్కరిణి వరకు నగర సంకీర్తన నిర్వహిస్తారు. కనుక ఈ దీపోత్సవంనందు తి.తి.దే., ఇతర సంస్థలలో పనిచేసే మహిళా ఉద్యోగులు, స్థానికులు, భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.