SPECIAL FESTIVALS IN JULY AT TIRUPATI SRI KODANDARAMA SWAMY TEMPLE _ జూలై నెల లో తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 28 June 2025: On July 5, 12, 19, and 26 (Saturdays), Abhishekam to the Moola Murty of Sri Sita, Rama, and Lakshmana will be performed at 6 AM.
At 5 PM, the Utsava Murthis of Sri Rama and Sita Devi will be taken on a procession along the four Mada Streets, followed by Unjal Seva in the temple.
On July 10 (Pournami), Astottara Kalasa Abhishekam will be held at 8.30 AM.
In the evening at 5.30 PM, Sri Kodandarama Swamy, along with Sita and Lakshmana, will be taken on a Tiruchi Procession.
On July 16, the temple will observe Anivara Asthanam.
Pavitrotsavams will be held from July 20 to 22, with Ankurarpanam on July 19.
On July 24, which coincides with Punarvasu Nakshatram and Amavasya.
Sahasra Kalasha Abhishekam will be performed at 7 AM
Sri Sita-Rama Kalyanam at 11 AM
In the night at 7 PM, Sri Rama will bless devotees on the Hanumantha Vahanam.
At Kapileswara Swamy Temple, Tirupati:
Annual Pavitrotsavams will be conducted from July 6 to 9.
జూలై నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు…..
- జూలై 05, 12, 19, 26 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్ సేవ జరుగనుంది.
- జూలై 10వ తేదీన పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర కలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తిరుచ్చిపై ఊరేగనున్నారు.
– జూలై 16న ఆణివార ఆస్థానం.
- జూలై 20 – 22 వరకు పవిత్రోత్సవాలు, జూలై 19న అంకురార్పణ.
– జూలై 24న పునర్వసు నక్షత్రం మరియు అమావాస్య సందర్భంగా ఉ. 7.00 గం.లకు సహస్రకలశాభిషేకం, ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం, రాత్రి 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.
తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయంలో…
జూలై 06 – 09వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.