PAVITHROTSAVAMS AT SRI KAPILESWARA SWAMY TEMPLE FROM JULY 6 TO 9 _ జూలై 06 నుండి 09వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 23 June 2025: The annual Pavithrotsavams at Sri Kapileswara Swamy Temple in Tirupati will be held from July 6 to 9.

The rituals begin with Ankurarpanam on July 6 at 6 PM.

These festivals are conducted as per Saiva Agama Shastra to purify and atone for any unintentional lapses or mistakes that might have occurred during temple rituals throughout the year.

July 7 (Day 1): Snapana Tirumanjanam to Utsava Murthis in the morning, followed by Kalasha Puja, Homa, and Pavitra Pratishtha in the evening.

July 8 (Day 2): Granthi Pavitra Samarpana in the morning, followed by Yagashala Puja and Homa in the evening.

July 9 (Day 3): Maha Purnahuti, Kalasha Udhvasana, and Pavitra Samarpana in the morning.

In the evening at 6 PM, a procession of the Panchamurthis Sri Kapileswara Swamy, Sri Kamakshi Ammavaru, Sri Vighneswara Swamy, Sri Subrahmanya Swamy, and Sri Chandikeswara Swamy will be held around the temple streets to bless the devotees.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 06 నుండి 09వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2025, జూన్ 23: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 06 నుండి 09వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూలై 06న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా జూలై 07న మొద‌టిరోజు ఉదయం ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ నిర్వ‌హిస్తారు.

జూలై 08న రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు.

జూలై 09న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.