12TH EDITION OF AKHANDA AYODHYAKANDA PARAYANAM ON JULY 10 _ జూలై 10న 12వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం
Tirumala, 07 July 2024: TTD is organising the 12th edition of Akhanda Ayodhyakanda Parayanam at Nada Neeranjanam platform on July 10 for the well-being of humanity.
SVBC will live telecast the program from 7am to 9am for the sake of global devotees and Vedic pundits from SV Veda Vijnana Peetham, SV Vedic University, TTD Veda pundits and scholars from National Sanskrit University will participate.
Under the guidance of Sri Ramanujacharya and Sri Ananta Venugopal the Parayanam of 142 Shlokas from 45-49 Sargas of Ayodhyakanda will be recited.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూలై 10న 12వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం
తిరుమల, 2024 జూలై 07: లోక కళ్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూలై 10వ తేదీ అయోధ్యకాండ 12వ విడత అఖండ పారాయణం జరుగనుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఎస్వీ వేద విఙ్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వ విద్యాలయం, టీటీడీ వేదపండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
అయోధ్యకాండలోని 45 నుండి 49 సర్గలలోని 141 శ్లోకాలు, పారాయణం చేస్తారు. ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం పండితులు శ్రీ రామానుజా చార్యులు, శ్రీ అనంత వేణుగోపాల్ శ్లోక పారాయణం చేస్తారు.
ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.