PUSHPA YAGAM AT TALLAPAKA TEMPLES ON JULY 15 _ జూలై 15న శ్రీసిద్ధేశ్వరస్వామి, శ్రీచెన్నకేశవస్వామి ఆలయాల్లో పుష్పయాగం

Tirupati, 14 July 2025: Pushpayagam will be held on July 15 at Sri Siddheswara Swamy and Sri Chennakesava Swamy temples in Tallapaka.

Morning rituals include Suprabhatam, Archana, and Snapana Tirumanjanam. 

In the evening from 6 PM to 8 PM, Pushpayagam will be performed with various flowers, followed by a temple procession.

This ritual is conducted as a purification ceremony after the annual Brahmotsavams to atone for any ritualistic lapses.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 15 శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాల్లో పుష్పయాగం

తిరుపతి / తాళ్ళపాక 2025 జూలై 14: తాళ్ళపాక శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాల్లో జూలై 15న పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరుగనుంది.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఘ‌నంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేస్తారు.

శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాల‌లో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల‌ వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. అనంతరం స్వామి వారు, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాల్లో జూలై 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.