ANIVARA ASTHANAM IN ALL LOCAL TEMPLES _ జూలై 17న టీటీడీ స్థానికాల‌యాల్లో ఆణివార ఆస్థానం

TIRUPATI, 15 JULY 2023: The temple budget fete of Anivara Asthanam will be observed on July 17.

 

This unique fete will be in TTD-run local temples of Sri Govindaraja Swamy, Sri Kodandarama Swamy (KRT) in Tirupati.

 

In KRT, Hanumantha Vahanam will be observed after 7pm on that day.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 17న టీటీడీ స్థానికాల‌యాల్లో ఆణివార ఆస్థానం

తిరుపతి, 2023, జూలై 15: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యాల్లో జూలై 17న సోమవారం ఆణివార ఆస్థానం జరుగనుంది.

ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో సాయంత్రం బంగారు వాకిలి వ‌ద్ద శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌స్త్రాల‌ను శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.

శ్రీ కోదండరామాలయంలో

శ్రీ కోదండరామాలయంలో గరుడాళ్వార్‌ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆణివార ఆస్థానం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.