SRIVARI DARSHAN TICKETS AND ACCOMMODATION ONLINE QUOTA FOR THE MONTH OF OCTOBER _ జూలై 18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

Tirumala,17 July 2024: The online quota of Srivari Darshan and accommodation for the month of October will be released on July 18 at 10 am.

Pilgrims can register for electronic Lucky dip till 10am of July 20 and those who get allotments should make payments and procure tickets between July 20-22 till 12 noon.

The tickets of Kalyanotsavam, Unjal Seva. Arjita Brahmotsavam and Sahasra Deepalankara Seva will be released online on July 22  at 10am.

TTD is releasing online virtual Seva tickets and their Darshan slots on July 22 at 3pm while the Anga Pradakshina tokens on July 23 at 10 am.

Srivani trust tickets available online on July 23 at 11am while the Senior citizens & challenged persons quota will be released 

on July 23 at 3 pm and the Special Entry Darshan (SED) tickets on July 24 at 10 am.

The accommodation quota for Tirumala and Tirupati will be released on July 24 at 3pm.

The Srivari Seva Service for Tirumala and Tirupati will be released on July 27 at 11am, Navaneeta Seva at 12 noon and Parakamani Seva at afternoon 1 pm.

In view of the annual Sriivari  Brahmotsavam between October 4 to 12, TTD has cancelled sevas and darshans 

Except Suprabhata seva all arjita Sevas stands cancelled from October 4-10 while on October 11 and 12 all Arjita sevas including Suprabhatam were cancelled.

From October 3-13, Virtual Sevas and Anga Pradakshina remains cancelled.

TTD appeals to pilgrims to note the changes and book their Arjita Seva, Darshan tickets and accommodation only through the TTD official website https://ttdevasthanams.ap.gov. in

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూలై 18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల, 2024 జూలై 17: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూలై 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

జూలై 22న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

జూలై 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

అక్టోబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

జూలై 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

అక్టోబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదల

జూలై 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో …

అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు.

అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు.

అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు చేయబడింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.