ARJITA SEVA TICKETS ON JULY 18_ జూలై 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Tirumala, 17 July 2023: The online dip of Arjita Seva tickets in electronic dip for the month of September, will be released on July 18 at 10am. Devotees can register till 10am July 20.
While the general arjita seva tickets will be released online on July 21 at 10am.
Anga Pradakshinam quota will be released on July 24 at 10am.
The devotees shall have to book these tickets only on the TTD official website, https://tirupatibalaji.ap.gov. in
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల, 2023, జూలై 17: భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.
ఇందులో భాగంగా అక్టోబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
అక్టోబరు నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.