జూలై 19 నుండి 28వ తేదీ వరకు శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆండాళ్ తిరువడిపురం ఉత్సవం
జూలై 19 నుండి 28వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్ తిరువడిపురం ఉత్సవం
తిరుపతి, 2025 జూలై 17: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 19 నుండి 28వ తేదీ వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాళ్అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
జూలై 28న శ్రీ ఆండాళ్ అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్ క్వార్టర్స లోని గీతా మందిరం, ఆర్‌ఎస్ మాడ వీధి లోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
