జూలై 2వ తేది నుండి 4వ తేది వరకు శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు
జూలై 2వ తేది నుండి 4వ తేది వరకు శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు
తిరుపతి, 2010 జూన్, 30: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఉప ఆలయమైన శ్రీ సుందరరాజస్వామి వారికి జూలై 2వ తేది నుండి 4వ తేది వరకు 3 రోజుల పాటు అవతారోత్సవాలు వైభవంగా జరుగుతాయి.
ఈ అవతారోత్సవాలలో సర్వలంకార శోభితుడైన శ్రీ సుందరరాజస్వామి వారు ముఖ మండపానికి వేంచేయగా అభిషేకాలు, నివేదన ఆస్థానాలు శాస్త్రోత్కరంగా జరుగుతాయి. అనంతరం స్వామివారు తిరిగి ఆలయాన్ని చేరుకొంటారు. ఇలా 3 రోజులపాటు అవతారోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
అదే విధంగా ప్రతి రోజు శ్రీ సుందరరాజస్వామి వారు వివిధ వాహనాలను అధిరోహించి మాఢవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం కల్పిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.