జూలై 2, 3 తేదీల్లో ద్వారకా తిరుమలలో గురువందన మహోత్సవం

జూలై 2, 3 తేదీల్లో ద్వారకా తిరుమలలో గురువందన మహోత్సవం

తిరుపతి, 2012 జూలై 01: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 2, 3 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో గురువందన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జలై 2వ తేదీ సోమవారం ఉదయం సుప్రభాతం, ధ్యానం, గ్రామసంకీర్తన, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం బాల భజనా మండళ్లతో సంకీర్తన కోలాటాల ప్రదర్శన ఉంటుంది. మధ్యాహ్నం ప్రముఖ పండితులతో ధార్మిక ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులతో సంగీత విభావరి నిర్వహించనున్నారు. జూలై 3వ తేదీ మంగళవారం గురుపౌర్ణమి సందర్భంగా గురువులను స్తుతిస్తూ సంకీర్తనలు ఆలపిస్తారు. గురువందన వైశిష్ట్యాన్ని ప్రముఖులు తెలియజేస్తారు. సుమారు 6 వేల మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని గురువులను స్మరించుకోనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.