ANNUAL PAVITROTSAVAMS OF SRI KODANDARAMA SWAMY FROM JULY 20 TO 22 _ జూలై 20 నుండి 22వ తేదీ వరకు శ్రీ కోదండ రామస్వామి వారి పవిత్రోత్సవాలు
Tirupati, 17 July 2025: The annual Pavitrotsavams of Sri Kodandarama Swamy Temple in Tirupati will be observed from July 20 to 22.
The festivities will begin with the Ankurarpanam in the evening of July 19.
As part of the Pavitrotsavams, on the first day, Pavitra Pratishtha, Sayanadhivasam are performed in the Yagashala, on the second day, Pavitra Samarpana, and Vedic programs are performed in the Yagashala and on the third day, the Pavitrotsavams will conclude with Vedic programs in the Yagashala and Purnahuti.
Every day, Snapana Tirumanjanam is performed in the morning and Tiru Veedhi Utsavam is performed in the evening.
Grihastas (two) can participate in the Pavitrotsavam by paying Rs. 500/- per ticket on which two persons are allowed.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 20 నుండి 22వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2025 జూలై 17: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు జూలై 20 నుండి 22వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూలై 19న సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ప్రతి రోజూ ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
