TIRUMALA JEEYAR SWAMIJIS CHATURMASA DEEKSHA FROM JULY 21 _ జూలై 21న తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస దీక్ష

Tirumala,19 July 2024: The significant element of Sanatana Vaidika Hindu Dharma, the annual Chaturmasa Deeksha of Tirumala Pontiffs will commence from July 21.
 
It is a tradition that during the holy four months of Shravana, Bhadra Pada, Ashvayuja and Karthika, Acharya Purushas (holy men)  observe holy bath, Japam, Homas and Vratam for the well-being of humanity.
 
As per the tradition set by Sri Vaishnava Saint Sri Ramanujacharya, the four-month Chaturmasa Vrata Deeksha will be commenced by both pontiffs of Tirumala.
 
On that day, along with their disciples, they first pave their visit to Sri Varaha Swamy temple and  Swamy Pushkarani and later to the Srivari temple following the age-old tradition.
 
They will be ceremoniously received at the temple Mahadwaram by the temple authorities.
 
After Srivari Darshan the pontiffs will be presented with Melchat Vastram and Noolchat Vastram to Tirumala Sri Pedda Jeeyar and Sri Chinna Jeeyar Swamijis at the Ranganayakula Mandapam.
  
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 21న తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస దీక్ష

తిరుమల, 2024 జూలై 19: జూలై 21వ తేదీ తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ నేపథ్యంలో రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన ఉన్న జీయంగారి మఠం నుండి చిన్నజీయంగారు మరియు శిష్య బృందంతో కూడి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేస్తారు. శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత టీటీడీ ఈఓ, ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీ‌శ్రీ‌శ్రీ‌ చిన్నజీయంగారికి నూలుచాటు వస్త్రాన్ని బహూకరిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికార ప్రముఖులు పాల్గొంటారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.