జూలై 22 నుండి 26వ తేదీ వరకు మహతిలో  శ్రీశ్రీశ్రీ శంకరానందగిరి స్వామివారి ధార్మికోపన్యాసాలు

జూలై 22 నుండి 26వ తేదీ వరకు మహతిలో  శ్రీశ్రీశ్రీ శంకరానందగిరి స్వామివారి ధార్మికోపన్యాసాలు

తిరుపతి, 2012 జూలై 20: తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జూలై 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రత్యేక ధార్మికోపన్యాసాలు జరుగనున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరులోని పరమాత్మానంద ఆశ్రమానికి చెందిన శ్రీశ్రీశ్రీ శంకరానందగిరి స్వామివారు ఉపనిషత్తులపై ఉపన్యాసాలు ఇవ్వనున్నారు.

ప్రతిరోజూ సాయంత్రం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. తిరుపతివాసుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపేందుకు తితిదే ప్రముఖ పండితులు, గురువులతో ఆధ్యాత్మికోపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భక్తులందరూ పాల్గొని ఆధ్యాత్మిక చైతన్యం పొందాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.