జూలై 30న విజయవాడలో జిల్లాస్థాయి ధార్మిక కథల పోటీలు

జూలై 30న విజయవాడలో జిల్లాస్థాయి ధార్మిక కథల పోటీలు

తిరుపతి, 29 జూలై 2023: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జూలై 30వ తేదీ విజయవాడలో విద్యార్థులకు జిల్లా స్థాయి రామాయణ, మహాభారత, భాగవత, ఇతిహాసాల మీద కథలు చెప్పే పోటీలు నిర్వహించనున్నారు

విజయవాడ ఏలూరు రోడ్డు చుట్టుగుంట సెంటర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లైన్స్ క్లబ్ ఆఫ్ ఈస్ట్ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు కథల పోటీలు హించనున్నారు. ఇందులో మొదటి విభాగంలో 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు, రెండవ విభాగంలో 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు పోటీలు జరగనున్నాయి. పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు ప్రశంసా పత్రాలుు అందజేస్తారు .

ఆసక్తిగల విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్టీఆర్ జిల్లా టీటీడీ జిల్లా ధర్మప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్- 7032255499 ను సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.