PAVITROTSAVAMS ANKURARPANA _ జూలై 30న శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
TIRUPATI, 29 JULY 2024: The Ankurarpana fete for the annual Pavitrotsavams will be held in Sri Kodandarama Swamy temple in Tirupati on July 30.
The three day Pavitrotsavams will begin with Pavitra Pratista on July 31 followed by Pavitra Samarpana and Pavitra Purnahuti on the remaining days respectively.
Grihastas can participate on payment of Rs.500 per ticket on which two persons will be allowed.
జూలై 30న శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2024 జూలై 29: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు జూలై 30న సాయంత్రం శాస్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. జూలై 31 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
వైదిక సంప్రదాయం ప్రకారంజాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.