PARASARESWARA BTU FROM JULY 5-14 _ జూలై 5 నుండి 14వ తేదీ వరకు నారాయణవనం శ్రీ పరాశరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 02 JULY 2024: The annual brahmotsavams in the TTD run sub-temple of Sri Champakavalli sameta Sri Parasaresara Swamy brahmotsavams in Narayanavanam are scheduled between July 5-14 with Ankurarpanam on July 3.
Dhwajarohanam will be held in the auspicious Mithuna lagnam between 5.45am and 6.45am on July 5 and the important days includes Nandi Vahanam on July 9, Rathotsavam on July 11, Kalyanotsavam on July 12, Trisula Snanam on July 14.
Grihastas can participate in the kalyanam on the payment of Rs.500 per ticket on which two persons will be allowed.
TTD is organizing cultural programmes on all these days.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూలై 5 నుండి 14వ తేదీ వరకు నారాయణవనం శ్రీ పరాశరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 జూలై 02: నారాయణవనం శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 5 నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయ. జూలై 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
జూలై 5వ తేదీ ఉదయం 5.45 నుండి 6.45 గంటల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం చంద్రప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు వాహన సేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జూలై 6వ తేదీన సింహ వాహనం, జూలై 7న హంస వాహనం, జూలై 8న శేష వాహనం, జూలై 9న నంది వాహనం, జూలై 10న గజ వాహనాలపై ఊరేగి స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
అదేవిధంగా జూలై 11వ తేదీన రథోత్సవం జరుగనుంది. జూలై 12వ తేదీన సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, అనంతరం అశ్వ వాహనసేవ నిర్వహించనున్నారు. జూలై 13న ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు నటరాజస్వామివారి ఉత్సవం, రాత్రి రావణేశ్వర వాహనసేవ జరుగనున్నాయి. జూలై 14వ తేదీన ఉదయం 11 గంటలకు త్రిశూలస్నానం నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
జూలై 12వ తేదీన నిర్వహించనున్న ఆర్జిత కళ్యాణోత్సవంలో రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. ఈ ఉత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.