RAVANA SAMHARAM ON JULY 6 _ జూలై 6న రావణ సంహారం సర్గల పారాయణం – అదనపు ఈవో
TIRUMALA, 03 JULY 2021: As a part of the ongoing Yuddhakanda Parayanam which is underway in Vasanta Mandapam in Tirumala since June 11, the most important episode of Sri Rama killing demon Ravanasura will take place on July 6.
Reviewing the arrangements for the same with Pundits, TTD Additional EO on Saturday directed the concerned to erect Ashoka Vanam settings in Vasanta Mandapam for that day. He also directed the SVBC officials to use special effects while the recitation of the most important episode is on.
A total of 270 Shlokas from 109 to 114 Sargas will be recited on July 6 out of which the Shlokas from 14 to 19 from 111 Sarga involves Sri Rama killing Ravanasura. As soon as these shlokas were completed, he directed the concerned to offer special harati as a mark of victory of Good over Evil. He said this episode equates the present situation of Covid virus and Rama killing Ravana signifies our fight to counter Coronavirus. This dreadful virus shall be eliminated from the world only with divine intervention and hence the programmes of this nature are being conducted by TTD, the Additional EO maintained.
He said the Yuddhakanda Parayanam has received overwhelming response from devout circles. The SVBC Channel of TTD will telecast this programme live on Tuesday, July 6 from 8:30am onwards for the sake of global devotees. “The Bhaktas of Srivaru are requested to watch the programme sitting in their houses and beget His blessings”, he added.
Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani, SVHVS Project Officer Dr A Vibhishana Sharma, Garden Superintendent Sri Srinivasulu and other Pundits were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూలై 6న రావణ సంహారం సర్గల పారాయణం – అదనపు ఈవో
తిరుమల, 2021 జూలై 03: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని వసంత మండపంలో రామాయణంలోని యుద్ధకాండ పారాయణంలో భాగంగా జూలై 6వ తేదీన రావణ సంహారం సర్గల పారాయణం చేయనున్నట్లు టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మరెడ్డి తెలిపారు. తిరుమలలోని వసంత మండపంలో శనివారం ఉదయం ఆయన అధికారులు, పండితులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు ఈవో మాట్లాడుతూ వసంత మండపంలో జూన్ 11న ప్రారంభమైన రామాయణంలోని యుద్ధకాండ పారాయణంకు ప్రపంచ వ్యాప్తంగా భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తొందన్నారు. ఇందులో భాగంగా జూలై 6న రావణ సంహారం సర్గల పారాయణం సందర్భంగా ఎస్వీబీసీ ప్రసారంలో ప్రత్యేక గ్రాఫిక్స్, వసంత మండపంలో అశోకవనంను తలపించే సెట్టింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. యుద్ధకాండ 109 నుండి 114 వరకు ఉన్న 270 శ్లోకాలను పారాయణం చేస్తారని చెప్పారు. ఇందులో 111వ సర్గ 14వ శ్లోకంలో శ్రీ రామచంద్రమూర్తి రావణునిపై బాణం ఎక్కు పెట్టడంతో ప్రారంభమై, 19వ శ్లోకంలో వధించడంతో పూర్తవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.
రామణ సంహారంపై శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు రచించిన కీర్తనలను అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపిస్తారని వివరించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్నిఉదయం 8.30 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిపారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని హారతులు ఇచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్, ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, వేద పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.