FIRST EDITION OF AYODHYA KANDA PARAYANAM ON JULY 9_ జూలై 9న ఒకటో విడత అయోధ్యకాండ అఖండ పారాయణం
Tirumala, 08 July 2023: The first edition of Ayodhya Kanda Akhanda Parayanam organised by TTD for the well-being of humanity will be held on July 9 on the Nada Neeranjanam platform between7am and 9am and will be live telecast on SVBC channel.
Vedic pundits from Dharmagiri Veda Vijnan Peetham, SV Vedic University and National Sanskrit University will participate in the program. Acharya Sri Ramanujacharyulu and Acharya Sri Ananta Venugopal of Dharmagiri peetham will explain the meaning and significance of each of 136 shlokas from 1,2,3 sargas of Ayodhya Kanda.
TTD appealed to devotees to tune in the SVBC channel from their homes and beget Srivari blessings.
జూలై 9న ఒకటో విడత అయోధ్యకాండ అఖండ పారాయణం
తిరుమల, 2023 జూలై 08: లోక కళ్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూలై 9వ తేదీ ఆదివారం అయోధ్యకాండ ఒకటో విడత అఖండ పారాయణం జరుగనుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి
9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఎస్వీ వేద విఙ్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వ విద్యాలయం, టీటీడీ వేదపండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
అయోధ్యకాండలోని 1, 2, 3 సర్గలు కలిపి 156 శ్లోకాలను పారాయణం చేస్తారు. ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం పండితులు శ్రీ రామానుజాచార్యులు ప్రతి శ్లోకం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. శ్రీ అనంత వేణుగోపాల్ శ్లోక పారాయణం చేస్తారు.
ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.