NO COTTAGE PRIVILEGES TO DONORS ON JAN 1, V-DAY _ జ‌న‌వ‌రి 1, వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి రోజుల్లో కాటేజి దాత‌లకు గ‌దుల కేటాయింపు నిలుపుద‌ల‌

Tirumala, 22 Oct. 19: In view of January 1 and Vaikuntha Ekadasi on January 6, the privileges to Cottage Donors are cancelled by TTD. 

The privileges will remain cancelled December 30, 31 and January 1. Similarly in view of Vaikuntha Ekadasi on January 6,  the privileges remain cancelled from January 4 to 7 for Donors.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

జ‌న‌వ‌రి 1, వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి రోజుల్లో కాటేజి దాత‌లకు గ‌దుల కేటాయింపు నిలుపుద‌ల‌

తిరుమల, 2019 అక్టోబ‌రు 22: నూత‌న ఆంగ్ల సంవ‌త్స‌రాది అయిన 2020 జ‌న‌వ‌రి 1, జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న వైకుంఠ ద్వాద‌శి రోజుల్లో తిరుమ‌ల‌కు విశేషంగా విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాటేజీ దాత‌ల‌కు, దాత‌ల సిఫార్సు లేఖ‌లు తీసుకొచ్చే వారికి గ‌దుల కేటాయింపు నిలుపుద‌ల చేస్తున్న‌ట్టు టిటిడి మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

నూత‌న ఆంగ్ల సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా డిసెంబ‌రు 30 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు, వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శిని పుర‌స్క‌రించుకుని జ‌న‌వ‌రి 4 నుండి 7వ తేదీ వ‌ర‌కు గ‌దుల కేటాయింపు ఉండ‌దు. ఈ మేర‌కు కాటేజి డోనార్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ అప్లికేష‌న్‌లో టిటిడి మార్పులు చేప‌ట్టింది. దాత‌లు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.


తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.