జ‌న‌వ‌రి 27 నుండి 29వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ – వేలం

జ‌న‌వ‌రి 27 నుండి 29వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ – వేలం

తిరుపతి, 2021 జ‌న‌వ‌రి 25: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 129 లాట్ల‌ను జ‌న‌వ‌రి 27 నుండి 29వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్త‌వి, వినియోగించిన వస్త్రాలు, (సిల్క్, పాలిస్టర్ ధోతీలు, చీరలు, టర్కీ టవ‌ళ్లు, రెడిమేడ్‌ వస్త్రాలు, రవికెలు, బెడ్ షీట్లు, పిల్లో కవర్లు, కర్చీఫ్ లు, దుప్పట్లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్ వ‌స్త్రాలున్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in  / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.