టిటిడిలో ఉద్యోగాలపై దళారులను నమ్మి మోసపోకండి : టిటిడి
టిటిడిలో ఉద్యోగాలపై దళారులను నమ్మి మోసపోకండి : టిటిడి
తిరుపతి, 2020 ఆగస్టు 27: టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్ధని టిటిడి విజిలెన్స్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఆదే ప్రాంతానికి చెందిన కిరణ్ నాయుడు తనకు పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయని, డబ్బులు ఇస్తే టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తారని మాయమాటలు చెప్పాడు. తనకు 20 వేల రూపాయాలు కమిషన్ ఇవ్వవలసి ఉంటుందని మోసం చేసే ప్రయత్నం చేశాడు. ఇతను ఇంతకు ముందు కూడా డబ్బుల తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని మోసం చేయడంతో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ నందు Cr.No. 220/2020, U/S 420 R/W 511 IPC ప్రకారము క్రిమినల్ కేసు నమోదు చేశారు.
గతంలో కూడా ఇదేవిధముగా టిటిడి నందు ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు మోసపు మాటలు చెప్పి కొంతమంది అమాయకుల నుండి డబ్బులు వసూలు చేసిన సందర్బములు ఉన్నాయి. అటువంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడము జరిగింది.
టిటిడిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేప్పుడు ముందుగా పత్రికల్లో, టిటిడి వెబ్సైట్లో అధికారిక ప్రకటన (నోటిఫికేషన్ ) ఇవ్వడం జరుగుతంది. ఎవరైన డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించడం పూర్తిగా అసాధ్యాము. ఇటువంటి విషయలపై టిటిడి గతములో కూడా ప్రజలకు స్పష్టముగా వివరణ ఇవ్వడము జరిగినది. ప్రజలు అప్రమత్తముగా ఉండి ఇటువంటి దళారుల మాటలు విని, మోసపోకుండా ఉండాలని టిటిడి కోరుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.