DISASTER MANAGEMENT TEAM IN TTD- ADDITIONAL EO _ టిటిడిలో డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటుకు చర్య‌లు – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

– 2nd GHAT BE READIED BY JAN 10

 

 Tirumala, 20 Dec. 21:  TTD Additional EO Sri AV Dharma Reddy has directed officials to set up a disaster management Team for taking immediate action to avert losses to property and human beings during calamities like rains and landslides in Tirumala. 

 

– After a spot inspection of ongoing works at the 2nd Ghat road the Additional EO directed officials to complete repairs on the 2nd Ghat road by January 10 and open up the road for devotee vehicles use in full form.

 

– At a review meeting with officials in his chambers as per directions of the TTD EO Dr KS Jawahar Reddy, the Additional EO instructed officials to prepare a SOP (standard operating procedures) to address calamity situation after consulting the functioning of such teams in District level.

 

He said such a team should review the weather office reports and inform the TTD management and alert the Forest, health, engineering and vigilance mowings.

 

He asked such a team to prepare a standard guideline within 15 days and frame regulations for each department to pursue during crisis situations

 

      

Reviewing on the plastic ban at Tirumala, the Additional EO said in a phased manner plastic carry bags, packing materials and dolls should be kept, away from Tirumala and urged officials to conduct an awareness session with local traders etc.

 

 

TTD JEO Smt Sada Bhargavi (virtually), JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, chief engineer Sri Nageswara Rao, SE-2 Sri Jagadiswar Reddy and others were present.

 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడిలో డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటుకు చర్య‌లు

– జ‌న‌వ‌రి 10లోపు రెండో ఘాట్ రోడ్డు మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేయాలి

– టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2021 డిసెంబరు 20: వ‌ర‌ద‌లు లాంటి విప‌త్తులు సంభ‌వించిన‌పుడు వెంట‌నే స్పందించి న‌ష్టాన్ని నివారించేందుకు వీలుగా టిటిడిలో డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రెండో ఘాట్ రోడ్డులో జ‌రుగుతున్న మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను జ‌న‌వ‌రి 10వ తేదీలోపు పూర్తి చేసి భ‌క్తుల వాహ‌నాల‌ను అనుమ‌తించేందుకు వీలుగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఘాట్ రోడ్డు ప‌నుల‌ను సోమ‌వారం నాడు ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించి ఇంజినీరింగ్ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

అనంత‌రం వ‌ర‌ద‌లు లాంటి విప‌త్తులు సంభ‌వించిన‌పుడు ఎలా స్పందించాలి అనే అంశంపై టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆదేశాల మేర‌కు తిరుమ‌ల‌లోని త‌న కార్యాల‌యంలో అద‌న‌పు ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాస్థాయిలో డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లు ఎలా ప‌నిచేస్తాయో తెలుసుకోవాల‌ని, విప‌త్తులు వాటిల్లిన‌పుడు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్‌(ఎస్ఓపి) త‌యారు చేయాల‌ని సూచించారు. ఈ టీమ్ ఎప్ప‌టిక‌ప్పుడు వాతావ‌ర‌ణ శాఖ నివేదిక‌ల‌ను ప‌రిశీలిస్తూ టిటిడి యాజ‌మాన్యానికి తెలియ‌జేయాల‌ని, అట‌వీ, ఆరోగ్య‌, ఇంజినీరింగ్, నిఘా మరియు భద్రత త‌దిత‌ర విభాగాలను అప్ర‌మ‌త్తం చేయాల‌ని కోరారు. ఈ టీమ్ 15 రోజుల్లోపు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సిద్ధం చేయాల‌ని, విభాగాల వారీగా చేప‌ట్టాల్సిన బాధ్య‌త‌ల‌ను రూపొందించాల‌ని సూచించారు.

ఆ త‌రువాత ప్లాస్టిక్ నిషేధంపై అద‌న‌పు ఈవో స‌మీక్షిస్తూ ద‌శ‌ల‌వారీగా ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, ప్యాకింగ్ మెటీరియ‌ల్‌, బొమ్మ‌ల‌ను తిరుమ‌ల‌కు దూరం చేయాల‌న్నారు. ఈ విష‌యంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు స్థానిక వ్యాపారుల‌తో ఒక స‌మావేశం నిర్వ‌హించాల‌ని కోరారు.

ఈ స‌మీక్ష‌లో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి(వ‌ర్చువ‌ల్‌గా), జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.