STATE ENDOWMENTS OFFICIALS VISITS TTD _ టిటిడిలో పాలనా అంశాలపై దేవాదాయ శాఖ అధికారుల అధ్యయనం
TIRUPATI, 05 OCTOBER 2021: Under the instructions of Honourable CM of AP Sri YS Jaganmohan Reddy, a team of officials from the AP Endowments Department visited TTD on Tuesday to learn on how the temple management is successfully implementing the administrative mechanism, various pilgrim-friendly measures in its temples etc. The team met TTD JEO for Education and Health Smt Sada Bhargavi and also participated in a meeting at the Conference Hall of TTD Administrative Building in Tirupati.
Chairing the meeting, the JEO explained various administrative and pilgrim welfare methodologies adopted in TTD including the Auditing, Accounting, Vigilance and Security, Annaprasadam, preparation of Prasadams, modernization of Potu, Darshan ticket issuing mechanism, IT, tenders process, digitization of jewels of Sri Venkateswara Swamy, Quality Control, sanitation, Master plan preparation etc. The Heads representing each of these departments also explained to them the administrative methods adopted by them towards successful execution.
The team comprised of Endowments Department Joint Commissioner Sri Chandrasekhar Azad, SE Sri S Srinivasa Rao, EEs, and Deputy Commissioners. Deputy EO of Tirumala temple Sri Ramesh babu, VGO Sri Manohar, CIO Sri Sandeep, CE OSD Sri Balaji Prasad were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడిలో పాలనా అంశాలపై దేవాదాయ శాఖ అధికారుల అధ్యయనం
తిరుపతి, 2021 అక్టోబరు 05: తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలుచేస్తున్న అనేక పరిపాలన అంశాలను అధ్యయనం చేసి రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అమలుచేయాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు ఆ శాఖ అధికారులు మంగళవారం టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవిని కలిశారు. అనంతరం తిరుపతిలోని పరిపాలనా భవనంలో జెఈవో అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా టిటిడిలో ఆడిటింగ్, అకౌంటింగ్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటి, అన్నదానం, ప్రసాదాల తయారీ, వంటశాలల ఆధునీకరణ, ఆదాయమార్గాలు మెరుగుపర్చడం, టికెట్ల జారీ విధానం, ఐటి, టెండర్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, మాస్టర్‌ప్లాన్ తయారీ, బంగారు ఆభరణాల డిజిటైజేషన్, క్వాలిటీ కంట్రోల్, ప్రాపర్టీ రికార్డుల నిర్వహణ తదితర అంశాలను జెఈవో వారికి వివరించారు. అదేవిధంగా టిటిడి అధికారులు ఈ విభాగాలకు సంబంధించిన పరిపాలన విధానాలను తెలియజేశారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్, ఎస్ఇ శ్రీ ఎస్.శ్రీనివాసరావు, ఈఈలు శ్రీ దుర్గేష్, శ్రీ జివిఆర్.శేఖర్, గెజిటెడ్ సూపరింటెండెంట్ శ్రీ రానా ప్రతాప్, ఇడిపి అధికారి శ్రీ ప్రసాద్, డెప్యూటీ కమిషనర్లు శ్రీ ఎం.రత్నరాజు, శ్రీ వివిఎస్‌కె.ప్రసాద్, ఎఇ శ్రీ సాయి ఈశ్వర్, టిటిడి విజివో శ్రీ మనోహర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి శ్రీ ఎల్ఎం.సందీప్, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎం.రమేష్‌బాబు, సిఇ ఓఎస్‌డి శ్రీ బాలాజిప్రసాద్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.