TTD ABSORBS KALIGIRIKONDA SV TEMPLE _ టిటిడి ఆధీనంలోకి కలిగిరికొండ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం
Tirupati, 10 Dec. 20: The ancient temple of Sri Venkateswara at Kaligirikonda village of Penumuru mandal in Chittoor district has been merged with the TTD on Thursday in the presence of AP Dy CM Sri Narayana Swamy.
Thereafter the Assistant Commissioner of the state endowment department Sri Chandramouli handed over the documents of the temple to DyEO Smt Shanti.
The temple was merged into the Srinivasa Mangapuram group of temples in TTD.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ఆధీనంలోకి కలిగిరికొండ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం
తిరుపతి, 2020 డిసెంబరు 10: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలిగిరికొండలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్యక్రమం గురువారం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారాయణస్వామి సమక్షంలో ఈ విలీన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ చంద్రమౌళి ఆలయానికి సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలను టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతికి అందజేశారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సముదాయంలో ఈ ఆలయాన్ని చేర్చారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఏఈవో శ్రీ ధనంజయులు, ఆలయ ఈవో శ్రీ రమణ, సూపరింటెండెంట్లు శ్రీ నటరాజు, శ్రీ చెంగల్రాయలు, అర్చకుడు శ్రీ శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.