HANUMAN JAYANTI CELEBRATED AT TTD TEMPLES _ టిటిడి ఆలయాల్లో వైభవంగా హనుమజ్జయంతి
Tirupati, 22 May 2025: On the occasion of Sri Hanuman Jayanti, grand celebrations were held on Thursday at various temples dedicated to Sri Anjaneya Swamy under the management of Tirumala Tirupati Devasthanams (TTD).
Special abhishekams and poojas were performed at Sri Eduru Anjaneya Swamy Temple near Sri Govindaraja Swamy Temple, Sri Matham Anjaneya Swamy Temple on Gandhi Road, Sri Abhaya Anjaneya Swamy Temple near the Old Huzur Office, Sri Bhakta Anjaneya Swamy Temple near Alipiri Padala Mandapam, Sri Abhaya Hasta Anjaneya Swamy Temple within the premises of Sri Kapileswara Swamy Temple in Tirupati, Sri Sanjeeva Raya Swamy Temple located opposite the Sri Kodandarama Swamy Temple in Vontimitta, Kadapa district.
After the rituals, prasadam was distributed to the devotees. The celebrations were carried out with great devotion and spiritual fervor.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఆలయాల్లో వైభవంగా హనుమజ్జయంతి
తిరుపతి, 2025 మే 22: శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా టీటీడీలోని స్థానికాలయాల్లో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి ఆలయం వద్ద ఉన్న ఎదురు ఆంజనేయ స్వామి ఆలయం, గాంధీ రోడ్డులోని మఠం ఆంజనేయ స్వామి ఆలయం, ఓల్డ్ హుజూర్ ఆఫీస్ వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం, అలిపిరి శ్రీపాదాల మండపం వద్ద ఉన్న శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం పరిధిలో శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి ఆలయాలలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.