JEO HOLDS VIDEO CONFERENCE WITH ALL TTD INFO CENTRE CHIEFS _ టిటిడి ఆలయాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి : వీడియో కాన్ఫరెన్స్‌లో తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
Tirupati, 28 Oct. 19: TTD JEO Sri P Basant Kumar directed all the In-charge officers of TTD Information Centres and Kalyana Mandapams located across the country to speed up the development works of the respective areas.
A video-conference with all the officers of the TTD Information Centres located at Kanyakumari, Hyderabad, Bengaluru, Chennai, Mumbai, Kurukshetra, New Delhi was held by JEO at Conference Hall in TTD Administrative Building on Monday.
He directed the officers concerned to implement paperless administration, ERP and internal audit in their respective centres and also ensure that there is no staff crunch. “If any problem is there, it should be immediately brought to my notice without any delay”, he instructed.
FACAO Sri Balaji, Additional FACAO Sri Raviprasadu, CAO Sri Sesha Sailendra, DyEO General Smt Sudharani and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఆలయాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి : వీడియో కాన్ఫరెన్స్‌లో తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్
తిరుపతి, 2019, అక్టోబరు 28: టిటిడి పరిధిలో ఇతర ప్రాంతాల్లో గల ఆలయాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం ఆయా ఆలయాల అధికారులతో జెఈవో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కన్యాకుమారి, చెన్నై, ముంబయి, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, హైదరాబాద్‌లోని ఆలయాల్లో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల పురోగతిని జెఈవో అడిగి తెలుసుకున్నారు. కల్యాణమండపాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, డార్మెటరీలు, వసతిగదుల వద్ద నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ కార్యాలయాల్లో కాగితరహిత పాలన సాగించాలని, ఇఆర్‌పిని అమలు చేయాలని, అంతర్గత ఆడిట్ తప్పకుండా చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరత, పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతి గురించి ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇకపై జరిగే వీడియో కాన్ఫరెన్సుల్లో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, అదనపు ఎఫ్ఏసిఏవో శ్రీ రవిప్రసాదు, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, డెప్యూటీ ఈవో(జనరల్) శ్రీమతి సుధారాణి, ఇడిపి ఓఎస్‌డి శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.