PREPARE ACTION PLAN FOR NEW ARJITA SEVAS AT ALL TTD TEMPLES- TTD JEO _ టిటిడి ఆలయాల్లో నూతన సేవల ప్రారంభానికి కార్యాచరణ రూపొందించాలి
జెఈవో శ్రీమతి సదా భార్గవి
టిటిడి ఆలయాల్లో నూతన సేవల ప్రారంభానికి కార్యాచరణ రూపొందించాలి: జెఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2021 సెప్టెంబర్ 02: టిటిడి ఆగమ సలహాదారు, అర్చకస్వాములతో చర్చించి ఆయా ఆలయాల్లో విశేషమైన రోజున నూతన సేవలను ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. శ్రీనివాసమంగాపురం, కపిలతీర్థం, ఒంటిమిట్ట తదితర గ్రూపు ఆలయాల అధికారులతో గురువారం సాయంత్రం జెఈవో శ్రీమతి సదా భార్గవి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి స్థానికాలయాలు, అనుబంధ ఆలయాలను ఎక్కువమంది భక్తులు దర్శించుకునేలా స్థలపురాణం, విశిష్టతను టిటిడి వెబ్‌సైట్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని సూచించారు. ప్రతినెలా ఆయా ఆలయాల్లో విశిష్టమైన ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆలయాల్లోని స్వామి, అమ్మవార్ల సేవల విశిష్టత, పాల్గొనే విధానం తదితర విషయాలను భక్తులకు తెలియజేయాలని కోరారు. ఆలయాల విశిష్టతకు సంబంధించి ఎస్వీబీసీ ద్వారా డాక్యుమెంటరీలు/ ప్రోమోలు తయారుచేయించి జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలన్నారు. ఆయా ఆలయాలకు ఉన్న రవాణా వసతులు, ఎలా చేరుకోవాలనే అంశాలను వెబ్‌సైట్‌తోపాటు ఆకర్షణీయంగా సూచికబోర్డుల ద్వారా తెలియజేయాలని సూచించారు. అన్ని ఆలయాల్లో మౌలిక వసతులు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆలయాల వారీగా నెలకు దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య, వారికి కల్పిస్తున్న వసతులు తదితర అంశాలపై జెఈవో సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ రమణప్రసాద్, శ్రీమతి శాంతి, ఎస్టేట్ అధికారి శ్రీ మల్లికార్జున, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, ఎవిఎస్వో శ్రీ శైలేంద్రబాబు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati, 02 September 2021: TTD Joint Executive Officer Smt Sada Bhargavi has directed officials to prepare an action plan for implementation of all new arjita sevas in TTD temples in consultation with Agama Advisors and Archakas.
Addressing officials of prominent TTD temple group of temples including Srinivasa Mangapuram, Kapilathirtham and Vontimitta through video conference from her chambers in TTD Administrative building, the TTD JEO urged officials to update the official website with the significance of sevas and also the local history of temples besides getting publicity through documentaries by SVBC etc.
She also urged officials to focus on facilities for devotees and organise events to attract more footfalls in all temples.
DyEOs Sri Ramana Prasad and Smt Shanti, Estate officer Sri Mallikarjuna, SE (electrical) Sri Venkateshwarlu, AVSO Sri Shailendra Babu were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI