REVIEW MEETING HELD ON GEO-FENCING OF TTD ASSETS _ టిటిడి ఆస్తుల జియో ఫెన్సింగ్ పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్
Tirupati, 23 February 2022: TTD has decided to provide Geo-Fencing for its valuable assets located across the country to protect from any encroachments or illegal occupations.
TTD JEO (Health and Education) Smt Sada Bhargavi held a review meeting on the TTD assets with the officials concerned at Sri Padmavati Rest House in Tirupati on Wednesday.
A power point presentation on Geo Survey, Mapping and Fencing techniques was presented by Sri Jayashankar, the Head of the Neer Interactive Pvt Ltd., Hyderabad.
The JEO directed the task force team to constantly review and inspect the assets to secure the properties from encroachments and instructed officials to plant trees along the borders of all TTD assets to avoid illegal occupations.
TTD FA and CAO Sri O Balaji, CE Sri Nageswara Rao, CAO Sri Shailendra, Transport GM Sri Shesha Reddy, Estate Special Officer Sri Mallikarjuna, Task Force Team Head Smt Lalithanjali, AEOs Sri Muniratnam, Sri Ashok, Sri Anjaneyulu, TTD Surveyor Sri Harinath were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడి ఆస్తుల జియో ఫెన్సింగ్ పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్
తిరుపతి, 2022 ఫిబ్రవరి 23: దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించడంలో భాగంగా జియో ఫెన్సింగ్ చేసేందుకు టిటిడి నిర్ణయించింది.
ఈ అంశానికి సంబంధించి జెఈవో(ఆరోగ్యం మరియ విద్య) శ్రీమతి సదా భార్గవి బుధవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన నీర్ ఇంటరాక్టివ్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ అధినేత శ్రీ జయశంకర్ టిటిడి ఆస్తులకు సంబంధించి ప్రయోగాత్మకంగా చేపట్టిన జియో సర్వేకి సంబంధించి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ప్రాధాన్యతాక్రమంలో టిటిడి ఆస్తులను విభజించి జియో సర్వే, జియో మ్యాపింగ్, జియో ఫెన్సింగ్ చేపట్టాలని ఈ సందర్భంగా జెఈవో ఎస్టేట్ విభాగం అధికారులను ఆదేశించారు. అదేవిధంగా టాస్క్‌ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో టిటిడి ఆస్తులను నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షణ జరగాలని సూచించారు. తద్వారా విలువైన టిటిడి భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చన్నారు. టిటిడి ఆస్తుల్లో సరిహద్దుల వెంబడి మొక్కలు నాటాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మల్లికార్జున, టాస్క్‌ఫోర్స్ టీమ్ హెడ్ శ్రీమతి లలితాంజలి, ఏఈవోలు శ్రీ మునిరత్నం, శ్రీ అశోక్, శ్రీ ఆంజనేయులు, సర్వేయర్ శ్రీ హరినాథ్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.