ACTRESS ODD BEHAVIOUR IRKS TTD -LODGES FALSE COMPLAINT AGAINST TTD STAFF _ టిటిడి ఉద్యోగులపై నటి అర్చనా గౌతమ్ దాడి హేయమైన చర్య
TTD SERIOUSLY CONDEMNS FALSE ALLEGATIONS
TIRUMALA, 05 SEPTEMBER 2022: Uttar Pradesh based Sri Shivakant Tiwari along with Actress Ms Archana Goutham and seven others brought a letter from a Union Minister for Darshan on 30-8-2022.
They registered in the Additional EO Office at Tirumala for Darshan. Later they were allotted Rs.300 tickets on this Referral letter and an SMS in this regard was delivered to the mobile number of Sri Tiwari on 9454607006.
But they have not availed the darshan. Again when Sri Tiwari went to office on the next day(August 31) seeking tickets for darshan. The on duty staff informed him that as they did not avail Darshan on time, on August 30, their tickets expired. In the mean time, Ms Archana Goutham rushed into the office and began shouting at the staff uttering unparliamentary words against them. Sri Tiwari was also seen as a mute spectator watching the entire high drama created by his team member. Though the TTD staff tried to explain the rule position and pacify her, she turned deaf and even manhandled one of the on duty office staff members. At last, the Office staff have allotted them Rs.300 tickets for the second time and advised them to go for Darshan.
But instead of going for Darshan, the actress went to the II Town Police and lodged a false complaint against one of the on duty staff alleging that he manhandled and abused her. Following her complaint, the CI called up the TTD staff and in his enquiry it was clearly seen in the video taken by the staff that how the woman behaved in an arrogant manner using filthy words against the staff. She was also seen pushing and hitting an on duty staff member. On seeing the video proof, she left the Police Station.
When the lady insisted on Break Darshan, the office staff advised her to take SRIVANI Trust and go for VIP break darshan on September 1 for which she needs to pay Rs.10,500 (Rs.10,000 to SRIVANI Trust and Rs.500 for the VIP Break ticket). But the lady in the video released by her on Social Media alleged that the Additional EO Office staff have demanded her Rs.10,000 for the ticket which is absolutely false.
Since she is a celebrity, the actress posted on Social Media incorporating all the fake and baseless allegations with an impression that the people will fall prey to her fake propaganda. TTD appeals to the devotees not to believe in such baseless and ruthless allegations.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఉద్యోగులపై నటి అర్చనా గౌతమ్ దాడి హేయమైన చర్య
– అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు
– టిటిడి ఖండన
తిరుమల, 2022 సెప్టెంబరు 05: ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీ శివకాంత్ తివారి, నటి అర్చనా గౌతమ్‌తోపాటు మరో ఏడుగురికి ఆగస్టు 31న శ్రీవారి దర్శనం కోసం కేంద్ర సహాయమంత్రి నుంచి సిఫారసు లేఖను తీసుకుని తిరుమలకు వచ్చారు. అదనపు ఈవో కార్యాలయంలో దర్శనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ లేఖపై రూ.300/- దర్శనం టికెట్లు మంజూరు చేస్తూ శ్రీ శివకాంత్ తివారీకి చెందిన 9454607006 మొబైల్ నంబరుకు మెసేజ్ పంపారు. అయితే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. అటు తరువాత శ్రీ శివకాంత్ తివారి అదనపు ఈవో కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే టికెట్లు తీసుకోవాల్సిన గడువు ముగిసిందని వారు తెలిపారు .
శ్రీ శివకాంత్ తివారితోపాటు అదనపు ఈవో కార్యాలయంలోకి చొచ్చుకుని వచ్చిన నటి అర్చనా గౌతమ్ ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి కార్యాలయ సిబ్బందిని దుర్భాషలాడారు. సర్ది చెప్పబోయిన ఒక ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. శ్రీ తివారి ఆమె చేస్తున్న యాగీని చూస్తూ ఉరుకున్నారు తప్ప ఆమెను వారించే ప్రయత్నం చేయలేదు. చివరకు ఆదనపు ఈవో కార్యాలయ సిబ్బంది వారి వివరాలు తీసుకుని రెండోసారి రూ.300/- టికెట్లు కేటాయించినా తీసుకోవడానికి నటి అర్చనా గౌతమ్ నిరాకరించారు. అనంతరం అక్కడినుండి టు టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కార్యాలయ సిబ్బంది తనపై చేయి చేసుకుని దురుసుగా ప్రవర్తించారని తప్పుడు ఫిర్యాదు చేశారు. అదనపు ఈవో కార్యాలయ సిబ్బందిని అక్కడి సిఐ పిలిపించి విచారణ చేపట్టారు. సిబ్బంది తాము తీసిన వీడియోను సిఐకి చూపగా నటి దురుసుగా ప్రవర్తించిన విషయం వెలుగుచూసింది. దీంతో నటి వెనక్కి తగ్గి అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఆగస్టు 1వ తేదీకి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ కావాలంటే రూ.10,500/- చెల్లించి శ్రీవాణి దర్శన టికెట్ పొందొచ్చని మాత్రమే సిబ్బంది సలహా ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉండగా అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది దర్శనం టికెట్ కోసం రూ.10 వేలు డిమాండ్ చేశారని సదరు వీడియోలో నటి ఆరోపించారు. తాను సెలబ్రిటీ అయినందువల్ల ఏమి చెప్పినా భక్తులు నమ్ముతారనే అభిప్రాయంతో నటి అర్చనా గౌతమ్ అవాస్తవాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. భక్తులు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.