టిటిడి కాంట్రాక్ట్‌ ఉద్యోగుల‌కు ప్ర‌తి వేత‌నాలు చెల్లించాలి – ఈవో శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు

టిటిడి కాంట్రాక్ట్‌ ఉద్యోగుల‌కు ప్ర‌తి వేత‌నాలు చెల్లించాలి – ఈవో శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు

తిరుపతి,  2010 జనవరి 08: తిరుమల తిరుపతి దేవస్థానములలో కాంట్రాక్ట్‌ పద్దతిలో ఉద్యోగం చేస్తున్న వారికి ప్రతి నెల జీతాలు సక్రమంగా అందేవిధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు ఆదేశాలు జారీచేసారు.

తితిదేలోని ప్రతి విభాగంలో అవసరం మేరకు కాంట్రాక్ట్‌ పద్ధతిలో తితిదే కొందరికి ఉద్యోగాలు కల్పించింది. అయితే వీరికి ప్రతి నెల సక్రమంగా జీతాలు అందడంలేదని పిర్యాదులు రావడంతో కార్యనిర్వహణాధికారి అన్ని విభాగాల డిప్యూటి ఇ.ఓ.లతో సమావేశమై తమ తమ పరిధిలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు అందేవిధంగా చూడాలని సూచించారు. ఇందుకోసం గ్రీవెన్స్‌ సేల్‌ను ఏర్పాటు చేసామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులు జీతాలు సక్రమంగా అందకపోతే 0877-2264581 అను ఫోన్‌ నెంబరుకు ఫోన్‌ చేసి సంక్షేమ విభాగం డిప్యూటి ఇఓకు పిర్యాదు చేయవచ్చునని తెలియజేసారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.