SPECIALLY ABLE EMPLOYEES SHOWCASE THEIR SKILLS _ టిటిడి క్రీడాపోటీల్లో ప్ర‌త్యేక ప్ర‌తిభావంతుల ప్ర‌తిభ

TIRUPATI, 15 FEBRUARY 2022: The specially-abled employees of TTD took part with sportive spirit in the ongoing Annual Sports Meet of TTD in Tirupati on Tuesday.

 

Chess was conducted separately to men and women employees.

 

Later Ball badminton, football, lawn tennis were also organised to men employees aged below 45 and Dodge Ball to women above 45.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

టిటిడి క్రీడాపోటీల్లో ప్ర‌త్యేక ప్ర‌తిభావంతుల ప్ర‌తిభ

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 15: టిటిడి ఉద్యోగుల క్రీడలు మంగ‌ళ‌వారం తిరుపతిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల‌ పరేడ్‌ మైదానం, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో హోరాహోరీగా జరిగాయి. ఇందులో ప‌లువురు ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన ఉద్యోగులు ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు.

చెస్‌

– ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన‌ మ‌హిళా ఉద్యోగుల పోటీల్లో శ్రీ‌మ‌తి బి.అరుణ‌కుమారి విజయం సాధించగా, శ్రీమ‌తి ఎం.విజ‌య‌ల‌క్ష్మి రన్నరప్‌గా నిలిచారు.

– ప్ర‌త్యేక ప్ర‌తిభావంతులైన పురుష‌ ఉద్యోగుల పోటీల్లో శ్రీ కె.ర‌వికుమార్‌ విజయం సాధించగా, శ్రీ ఎంవిఎస్‌.సత్యం రన్నరప్‌గా నిలిచారు.

– పాక్షికంగా అంధులైన‌ ఉద్యోగుల పోటీల్లో శ్రీ సి.రెడ్డెప్ప‌రెడ్డి విజయం సాధించగా, శ్రీ ఎస్‌.బ‌యారెడ్డి రన్నరప్‌గా నిలిచారు.

పాసింగ్ ది ల‌గేజ్‌

– 45 ఏళ్ల‌లోపు మ‌హిళా ఉద్యోగుల పోటీలలో శ్రీమ‌తి జి.చిన్న‌మునెమ్మ జ‌ట్టు విజ‌యం సాధించగా, శ్రీమ‌తి వి.ర‌మాదేవి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.

డాడ్జి బాల్‌

– 45 ఏళ్లు పైబ‌డిన మ‌హిళా ఉద్యోగుల పోటీలలో శ్రీమ‌తి ఎం.శోభారాణి జ‌ట్టు విజయం సాధించగా, శ్రీమ‌తి ఎం.మునిల‌క్ష్మి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.

బాల్ బ్యాడ్మింట‌న్‌

– 45 ఏళ్ల‌లోపు ఉద్యోగుల పోటీలలో శ్రీ చీర్ల కిర‌ణ్ జ‌ట్టు విజయం సాధించగా, శ్రీ ఎ.ధ‌న‌శేఖ‌ర్ జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.

– 45 ఏళ్లు పైబ‌డిన ఉద్యోగుల పోటీలలో శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి జ‌ట్టు విజయం సాధించగా, శ్రీ ఎన్‌.చంద్ర‌శేఖ‌ర్‌ జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.

లాన్ టెన్నిస్‌

– 45 ఏళ్ల‌లోపు ఉద్యోగుల సింగిల్స్‌ పోటీలలో శ్రీ వై.వేణుగోపాల్ రెడ్డి విజయం సాధించగా, శ్రీ ఆర్‌.తుల‌సీరామ్‌ రన్నరప్‌గా నిలిచారు.

– 45 ఏళ్ల‌లోపు ఉద్యోగుల డ‌బుల్స్‌ పోటీలలో శ్రీ వై.వేణుగోపాల్ రెడ్డి, శ్రీ ఎం.ర‌మేష్ జ‌ట్టు విజయం సాధించగా, శ్రీ జి.విజ‌య‌కుమార్ వ‌ర్మ‌, శ్రీ ఆర్‌.తుల‌సీరామ్ జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.

ఫుట్‌బాల్‌

– ఈ పోటీలలో శ్రీ టి.సంతానం జ‌ట్టు విజయం సాధించగా, శ్రీ ఓ.ఓబుల్‌రెడ్డి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.